ఆ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్.. వైద్యుల నిరసన..

నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో జిల్లా అధికారుల పరిశీలన.. జిల్లా కలెక్టర్ వర్సెస్ వైద్యుల వార్‎గా మారుతోంది. జిజిహెచ్‎లో మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేకాధికారుల పరిశీలనకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కార్యాచరణ రూపొందించారు. జిజిహెచ్‎లో జిల్లా స్థాయి అధికారుల పెత్తనమెంటని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఇతర సిబ్బంది ఆందోళన చేశారు.

shashi kiran

నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో జిల్లా అధికారుల పరిశీలన.. జిల్లా కలెక్టర్ వర్సెస్ వైద్యుల వార్‎గా మారుతోంది. జిజిహెచ్‎లో మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేకాధికారుల పరిశీలనకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కార్యాచరణ రూపొందించారు. జి జిహెచ్‎లో జిల్లా స్థాయి అధికారుల పెత్తనమెంటి అంటూ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్యులు, ఇతర సిబ్బంది ఆందోళన చేశారు. నూతనంగా జిల్లా కలెక్టర్‎గా బాధ్యతలు స్వీకరించిన నారాయణ రెడ్డి కొద్దిరోజుల క్రితం జీజీహెచ్‎ను సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలు, హెచ్ వోడీల పనితీరుపై సమీక్షించారు. వైద్యాధికారులు, సిబ్బంది పని తీరు మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. జీజీహెచ్ మెరుగైన సేవలు, జవాబుదారీతనం కోసం నిత్యం అధికార యంత్రాంగంలోని ఏదో ఒక శాఖ జిల్లా అధికారి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Also read : Recruitment of IPPB IT Executives 2024: Vacancy 54 Positions

Leave a Comment